నాకు కడుపు చేసి మరొక నటితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. భర్తపై కేసు పెట్టిన దివ్య

ప్రముఖ కన్నడ నటి దివ్య శ్రీధర్.. తన భర్త, నటుడు అర్నవ్ దారుణంగా మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. 2017లో 'కేలడి కన్మణి' సీరియల్‏తో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు.. Latest Telugu News

Update: 2022-10-07 07:57 GMT

దిశ, సినిమా : ప్రముఖ కన్నడ నటి దివ్య శ్రీధర్.. తన భర్త, నటుడు అర్నవ్ దారుణంగా మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. 2017లో 'కేలడి కన్మణి' సీరియల్‏తో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా తనను గర్భవతిని చేసిన భర్త మరో నటితో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ప్రెగ్నెంట్ అని తెలియగానే దూరంగా ఉండటం మొదలుపెట్టాడన్న ఆమె.. ప్రస్తుతం తాను అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. ఇక తనకు, పుట్టబోయే బిడ్డకు ఏదైనా జరిగితే అర్నవ్‏ బాధ్యతేనని ఫిర్యాదులో పేర్కొన్న నటి.. తనకు అబార్షన్ చేయమని వైద్యులకు డబ్బులిచ్చాడని వాపోయింది. ఎలాగైన తనకు న్యాయం చేయలంటూ కమిషనర్‏ను ఆశ్రయించనున్నట్లు దివ్య తరపు న్యాయవాది తెలుపగా ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇవి కూడా చదవండి : ఆ వయసులో పుట్టే ప్రేమకు అర్థం లేదు.. మృణాల్ ఠాకూర్

ఇవి కూడా చదవండి : అలియా‌ భట్ శ్రీమంతం.. బంగారు బొమ్మలా ఉందంటున్న ఫ్యాన్స్


Similar News