నయనతారతో విడాకులు.. క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన విఘ్నేష్

స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ హీరోల చిత్రాల్లో నటించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

Update: 2024-03-05 03:52 GMT
నయనతారతో విడాకులు.. క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన విఘ్నేష్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ హీరోల చిత్రాల్లో నటించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్‌గా పలు చిత్రాల్లో  నటించి మెప్పించింది. గత కొద్ది కాలంగా లేడీ సూపర్ స్టార్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే అమ్మడు 2022లో కోలీవుడ్ డైరెక్టర్, నిర్మాత, నటుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. గతేడాది సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఈ జంట పలు చిక్కుల్లో పడింది. సరోగసీ ద్వారా పిల్లలను కన్నందుకు కోర్టు వరకూ వెళ్లాల్సింది.

అయితే నయనతార ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస చిత్రాల్లో నటిస్తూ మళ్లీ ఇండస్ట్రీని ఊపేస్తుంది. అంతేకాకుండా పలు యాడ్స్‌ చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల నయనతార విఘ్నేష్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కొట్టి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా షేర్ చేయడంలో అది కాస్త వైరల్ అయింది.

దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది అందుకే అన్ ఫాలో చేసిందని నెట్టింట చర్చించుకున్నారు. కానీ అదంతా టెక్నికల్ ఇష్యూస్ అని తర్వాత విఘ్నేష్ పోస్ట్ చేయడంతో క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని తొందరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, విఘ్నేష్ ఓ వీడియోను షేర్ చేయడంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్లు అయింది.

అయితే ఆ వీడియో గత సంవత్సరం తమ పెళ్లి రోజు తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని మళ్లీ షేర్ చేయడంతో డైవర్స్ గురించి క్లారిటీ ఇచ్చేందుకు పెట్టినట్లు అర్థమవుతోంది. ఇందులో ఓ ఫ్లూట్ వాయిస్తున్న వ్యక్తి దగ్గర నయన్- విఘ్నేష్ మ్యూజిక్ వింటున్నారు. ఈ క్రమంలోనే నయన్ భర్తను పట్టుకుని ముద్దులు పెడుతూ ఎమోషనల్ అయింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా నయన్ ఫ్యాన్స్ విడిపోయారని అంటున్న వారికి భలే సమాధానమిచ్చారంటూ అంటున్నారు.




Tags:    

Similar News