ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా డిస్టిబ్యూటర్ భరత్ భూషణ్ గెలుపు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శి పోస్టులకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ విజయం సాధించారు.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శి పోస్టులకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ విజయం సాధించారు. మొత్తం ఫిలిం ఛాంబర్ లో 48 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 46 మంది ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ లో పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించగా.. భరత్ భూషణ్ కు 29 ఓట్లు రాగా.. ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. దీంతో భరత్ అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వగా.. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరగ్గా.. ఈ సారి.. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న భరత్ భూషణ్ ఎన్నికయ్యాడు.