ప్రభాస్‌తో ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ.. మైనస్ డిగ్రీల చలిలో పక్కపక్కనే.. నెట్టింట ఫొటోస్ వైరల్

రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'KALKI 2898 AD' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీపిక పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్న సినిమాలో హాట్ బ్యూటీ దిశా పఠానీ

Update: 2024-04-05 09:10 GMT

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'KALKI 2898 AD' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీపిక పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్న సినిమాలో హాట్ బ్యూటీ దిశా పఠానీ కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటుంది. కాగా ఈ షెడ్యూల్ లో ప్రభాస్, దిశ కాంబినేషన్ లో సీన్స్ తెరకెక్కిస్తుండగా.. తమ షూటింగ్ కష్టాలను నెట్టింట షేర్ చేసింది ఈ భామ. మైనస్ డిగ్రీల చలిలో దుప్పటి కప్పుకున్నా వణికిపోతున్న హాటీ.. ఈ ఫొటో సిరీస్ లో ప్రభాస్ తో కలిసి ఉన్న పిక్స్ కూడా పంచుకోగా రెబల్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఆయన కట్ అవుట్, కాస్ట్యూమ్ కు ఫిదా అయిపోతున్న అభిమానులు.. కచ్చితంగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని మురిసిపోతున్నారు.


ఇక దిశ నటించిన ‘బడే మియా చోటే మియా’ ఏప్రిల్  10న రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా రాబోతున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు.


Disha Pathani shares photo dump of 'KALKI 2898 AD'shooting in Italy


Similar News