జూ. ఎన్టీఆర్ ఒక్కడే మగాడు: NTR శతజయంతి రోజున ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
నటుడు, ఏపీ దివంగత సీఎం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో టీడీపీ పెద్దఎత్తున మహానాడు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: నటుడు, ఏపీ దివంగత సీఎం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో టీడీపీ పెద్దఎత్తున మహానాడు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమంపై కాంట్రావర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. రాజమండ్రిలో ఒక పెద్ద జోక్ జరుగుతోందని ఇన్ డైరెక్ట్‌గా టీడీపీ మహానాడు కార్యక్రమంపై సెటైర్లు వేశారు ఆర్జీవీ. ఇది చూసి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా నవ్వాలో.. ఏడవాలో అర్థంకాని పరిస్థితి అని టీడీపీపై వ్యంగ్యస్త్రాలు సందించారు.
ఎన్టీఆర్ బతికున్నప్పుడే స్వయంగా ఆయనే చంద్రబాబు ఎలాంటి వాడో చెప్పారని.. అలాంటి వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్‌ను పొగడటం మళ్లీ ఎన్టీఆర్‌కు వెన్నపోటు పొడవటమేనని అన్నారు. అలాంటి వ్యక్తులతో వేదికను పంచుకోకుండా జూ. ఎన్టీఆర్ ఒక్కడే.. ఒక్క మగాడిగా కట్టుబడి ఉన్నాడని రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎన్టీఆర్ తన తాత ప్రతిష్టాత్మక శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి దూరంగా ఉండటంతో.. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Read more:
NTR ఘాట్ వద్ద తారక్ వింత ప్రవర్తన.. నెట్టింట్లో విమర్శలు!
ఎన్టీఆర్‌తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు : తేజ
తెలంగాణ షీ టీమ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఫాలో కావాలంటున్న పోలీసులు!