విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఎప్పుడో తెలుసా?
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలంతా ప్రస్తుతం పెళ్లి బాట పడుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలంతా ప్రస్తుతం పెళ్లి బాట పడుతున్నారు. రీసెంటుగా శర్వానంద్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే బాటలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా పెళ్ళికి సిద్దమయ్యాడు.
విజయ్, రష్మిక ప్రేమించుకుంటున్నారని ,వీరిద్దరూ తరచూ ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇన్ని వార్తలు వస్తున్న ఇద్దరూ ఖండించలేదు. దీంతో అభిమానులంతా వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి రెండు కుటుంబాలవారు ఓకే చెప్పారని తెలుస్తుంది. త్వరలో వీరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని, వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే మరో క్రేజీ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.