Bharateeyudu 3: భారతీయుడు 3 ఓటీటీకి ఇచ్చేసారా.. ఈ వార్తల్లో నిజమెంత?

భారతీయుడు 3 ఓటీటీకి ఇచ్చేసారా.. ఈ వార్తల్లో నిజమెంత?

Update: 2024-07-18 14:11 GMT

దిశ, సినిమా: డైరెక్టర్ శంకర్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకుంటారు ఎందుకంటే అతను తీసిన సినిమాలే అందుకు ఉదాహరణ. రోబో సినిమాలో టెక్నాలజీ వాడి ఎంత బాగా చిత్రీకరించాడో మనకి బాగా తెలుసు. తాజాగా, భారతీయుడు 2 తో మన ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ‘భారతీయుడు 2’ బయటికొచ్చాక ఆసక్తికర చర్చ నడుస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

భారతీయుడు 2 మూవీ ఎండింగ్లో పార్ట్ 3 ట్రైలర్ వదిలి అందర్ని సర్ ప్రైజ్ ఇచ్చారు. అనుకున్న కలెక్షన్స్ రాకపోవడంతో ఈ మూవీ డైరెక్ట చేసిన శంకర్ ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. నష్టపోయిన డబ్బును తిరిగి రికవరీ చేయాలనే ఉద్దశంతో ఈ ప‌ని చేస్తున్నారని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ మూవీ షూటింగ్ చేయకపోతే భార‌తీయుడు 3 అప్డేట్ అప్పుడే తెలిసేది కాదు కానీ, చిత్రీకరణ స్టార్ట్ చేయడంతో ఇప్పుడు ముగించక తప్పదు. ప్రస్తుతం దీనికి సంబందించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి. 


Similar News