ధోనీ LGM చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆయన భార్య సాక్షి సింగ్‌తో కలిసి నిర్మాన సంస్థను స్థాపించి.. ధోని ఎంటర్టైన్మెంట్ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఎంఎస్ ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఎల్‌జీఎమ్ ( లెట్స్ గెట్ మ్యారీడ్) అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ సతీమణి మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ధోని రిలీజ్ చేశాడు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ హీరోగా, ఇవానా హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ చిత్రం విభిన్నమైన ప్రేమ కథ కమ్ పెళ్లి స్టోరీతో తెరపైకి రానున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. పోస్టర్లో ఒక రింగ్‌లో హీరో హీరోయిన్, నదియాను బంధించి ఉంది. యోగి బాబు, నదియా కూడా మఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఐపీఎల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. పోస్టర్ చూశాక సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతిత్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి: Sai Dharam Tej: 'విరూపాక్ష' ట్రైలర్ చూస్తుంటే భారీ స్థాయిలో వసూళ్లు ఖాయమంటున్న.. అల్లు అరవింద్