’దేవకీ నందన వాసుదేవ’ మురారి మూవీకి మించి ఉంటుంది: అర్జున్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

Update: 2024-10-06 13:28 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇందులో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ‘దేవకీ నందన వాసుదేవ’ నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. గొప్ప చిత్రం చేశానని చెప్పగలను. ప్రశాంత్ ఇచ్చిన కథ యూనిక్ స్టైల్‌లో ఉంది. కథ ఇచ్చాక సోల్ దెబ్బతినకుండా మీకు నచ్చిన రీతిలో చేయమని అన్నారు. ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పక్కా కమర్షియల్‌తో కూడిన సినిమాగా తీశాం. ఇంతకు పూర్వం కూడా ఇలాంటి కథ రాలేదు. మురారి మూవీతో భీమ్స్ పోల్చారు. అంతకు మించి నదిగా ఉంటుందని చెప్పగలను. అశోక్ టాప్ రేంజ్ హీరోలా చేశారు. ఆదిపురుష్‌లో నటించిన దేవదత్త నాగ్ కూడా బాగా నటించారు. మానస చాలా సహకరించి సినిమా బాగా వచ్చేలా నటించింది. మొదటి నుంచి హిట్ సినిమా చేయాలని పట్టుదలతో తీశాం’’ అన్నారు.


Similar News