సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్‌లు ఇవ్వకుండా అవమానించారు : Hansika Motwani

ఆపిల్ బ్యూటీ హన్సికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Update: 2023-06-11 13:29 GMT

దిశ, సినిమా: ఆపిల్ బ్యూటీ హన్సికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా ఆమెను అభిమానించే వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కాగా తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానం గురించి వెల్లడించింది. ‘ఒకప్పుడు మాకు డ్రెస్‌లు ఇవ్వడానికి డిజైనర్స్ ఆసక్తి చూపేవారు కాదు. సౌత్ హీరోయిన్ అంటూ బ్యాడ్ కామెంట్స్ చేసి అవమానించారు. కానీ నేను బాధ పడలేదు. మరింత కష్టపడాలని అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ డిజైనర్స్.. వారు డిజైన్ చేసిన డ్రెస్ ధరించాలని బ్రతిమిలాడుతున్నారు. ఏదైనా ఈవెంట్ ఉంటే వారంతట వారే వచ్చి డ్రెస్ వేసుకోమని అడుగుతున్నారు. ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది’ అని తెలిపింది బ్యూటీ. 

ఇవి కూడా చదవండి:

టీనేజ్‌లోనే రొమాన్స్‌లో పీక్స్ చూస్తున్న ఆ హీరోయిన్ కూతురు.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో దొరికిపోయింది..  

Tags:    

Similar News