చిక్కుల్లో Adipurush మూవీ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Adipurush: Delhi court shocks Adipurush team.. Notices to Prabhas too

Update: 2022-10-10 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో చిక్కుల్లో పడ్డాడు. ఆదిపురుష సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మేకర్స్, నటులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడు పాత్రలను తప్పుగా చూపించారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని రాజ్‌ గౌరవ్‌ అనే న్యాయవాది పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. రామాయణంలోని నిజమైన పాత్రలను ఇస్లామీకరణగా ప్రదర్శించడం వివాదాస్పద చర్యగా అభివర్ణించబడ్డాయని దాఖలు చేశారు.

ఈ రామాయణ కథనం ప్రకారం.. 'రాముడు ప్రశాంతంగా, ఉదారంగా ఉండేవాడు. కానీ, ఈ టీజర్‌లో రాముడుని కోపంగా, ఇతరులను చంపాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తిగా చూపించారు. రావణుడి పాత్రను చాలా చౌకగా చూపించారు. శివ భక్తుడైన రావణుడు మనోహరమైన దుస్తులు ధరించి, మీసాలు కూడా కలిగి ఉంటాడు. ఎప్పుడూ బంగారు కిరీటాన్ని ధరిస్తారు. ఈ చిత్రంలో ఇలాంటివి హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని' రాజ్ గౌరవ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు తాజాగా ఆదిపురుష్ చిత్ర బృందానికి, హీరో ప్రభాస్‌కి నోటీసులు కూడా పంపారు.

ఇవి కూడా చదవండి : నువ్వే నువ్వే @ 20: అమ్మ.. ఆవకాయ్.. అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు..

Tags:    

Similar News