పెళ్లి తర్వాత ఆ ఒక్కటే మారింది.. సాయంత్రం 6 తర్వాత నా భర్తతో ఖచ్చితంగా అలా చేయాల్సిందే.. హన్సిక కామెంట్స్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ హన్సికకు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ హన్సికకు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ప్రస్తుతం హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే మూవీతో రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆర్గాన్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో శ్రీనివాస్ ఓంకార్ రూపొందిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హన్సిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ మ్యారేజ్ చేసుకున్నాక నా లైఫ్ ఏం మారలేదు. షూటింగ్ టైమ్‌లో సినిమాలోని క్యారెక్టర్లో ఉంటాను. ఇంటికెళ్లిన తర్వాత నా భర్తతో ఉంటా అంతే తేడా. ఇక సాయంత్రం 6 తర్వాత నా భర్తతో ఖచ్చితంగా గడుపుతాను. అలాగే మెయిన్‌గా నా మ్యారేజ్ తర్వాత నా అడ్రెస్ మాత్రమే మారింది. నా ఇంటి పేరు కూడా మారలేదు. ఎందుకంటే హన్సిక మోత్వానీ అనే ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.