NBK 108:బోల్తా కొట్టిన బాలయ్య మూవీ యూనిట్ వ్యాన్
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో '#NBK 108' మూవీ తెరకెక్కుతున్న విషయంతెలిసిందే.
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో '#NBK 108' మూవీ తెరకెక్కుతున్న విషయంతెలిసిందే. కాగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'ఎఫ్ 3' మూవీ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. తాజాగా బాలయ్య సినిమాలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. బాచుపల్లి దగ్గర ప్రగతి నగర్ చెరువు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం.