మాజీ భర్త రొమాన్స్‌పై నటి సీరియస్.. అస్సలు నచ్చలేదంటూ
టెలివిజన్ నటి దల్జీత్ కౌర్.. తన మాజీ భర్త షాలిన్ భానోట్ సహనటి టీనా దత్తాతో చేస్తున్న రొమాన్స్‌పై స్పందించింది.
దిశ, సినిమా : టెలివిజన్ నటి దల్జీత్ కౌర్.. తన మాజీ భర్త షాలిన్ భానోట్ సహనటి టీనా దత్తాతో చేస్తున్న రొమాన్స్‌పై స్పందించింది. ప్రస్తుతం షాలిన్ భానోట్, టీనా దత్తా 'బిగ్ బాస్' హౌస్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుండగా.. ఆయన తమ పెళ్లి, రిలేషన్ గురించి టీనాతో చర్చించడం అస్సలు నచ్చలేదని చెప్పింది. గృహహింస, వరకట్నం వేధింపుల కారణంగా తాము విడిపోయామన్న ఆమె.. విడాకుల తర్వాత మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని అతను నొక్కి చెప్పడం ఫన్నీగా ఉందని, ఇకనైనా తమ గతాన్ని అపహాస్యం చేయడం మానేయాలని కోరింది.
'నన్ను తన బెస్ట్ ఫ్రెండ్ అని పిలిచినందుకు కలత చెందడం కన్నా.. టీనాతో చెప్పడం నచ్చలేదు. 'బిగ్ బాస్ సీజన్13'లో నేను 15 రోజులు ఉన్నాను. కానీ ఒక్కసారి కూడా షాలిన్ గురించి చర్చించలేదు. మా బ్రేకప్ గురించి మాట్లాడలేదు. దేని గురించి జోక్ చేయలేదు. హౌస్‌లో ఏడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించడం చాలా సులభం. నేనెప్పుడూ అలా చేయలేదు. షోలో తన రేటింగ్ పెంచుకోవడం కోసం మా విడాకుల ఇష్యూను ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది.