పవన్ కల్యాణ్ సెన్సేషనల్ విక్టరీ.. దళపతి విజయ్ సంచలన ట్వీట్

జనసేన చీఫ్, ఏపీలో గేమ్ ఛేంజర్‌ అవతారమెత్తిన పవన్ కల్యాణ్‌కు తమిళస్టార్ హీరో, తమిళగ వెట్రీ కజగమ్ పార్టీ అధినేత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు.

Update: 2024-06-05 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్, ఏపీలో గేమ్ ఛేంజర్‌ అవతారమెత్తిన పవన్ కల్యాణ్‌కు తమిళస్టార్ హీరో, తమిళగ వెట్రీ కజగమ్ పార్టీ అధినేత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో జనసేన పార్టీ 2 వ అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు శుభాకాంక్షలు. మీ ఓర్పు, అంకితభావం, ప్రజలకు సేవ చేయాలనే తపన ప్రశంసనీయం అని విజయ్ అన్నారు. కాగా పవన్ కల్యాణ్ విజయంపై విజయ్ చేసిన ఈ ట్వీట్ 1.2 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. కాగా, మొదటి నుంచి విజయ్ పవన్ కల్యాణ్ అభిమానిగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ తెలుగు హిట్ మూవీస్‌ని ఆయన తమిళంలో రిమేక్ చేసి నటించిన సినిమాలు సైతం సక్సెస్ అయ్యాయి.  


Similar News