విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి సెన్సేషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ.. నేను తెలంగాణ బిడ్డ నేనంటూ
బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి వరుస చిత్రాల్లో నటిస్తూ ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది.
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి వరుస చిత్రాల్లో నటిస్తూ ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌తో దూసుకుపోతుంది. అలాగే అనసూయ అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే గతంలో విజయ్ దేవరకొండతో ఏదో వివాదం ఉన్నట్లు అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయి కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ నెటిజన్ విజయ్ చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ మధ్యలో అనసూయ తీసుకొచ్చాడు. ఇటీవల విజయ్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో చేసిన కామెంట్స్ పై నెటిజన్ ఇలా రియాక్ట్ అయ్యాడు. అతగాడిది పీఆర్‌ను పించిన మాఫియా. ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడటం. వెంటనే పీఆర్ మాఫియా తో తెలంగాణ హీరో మీద ద్వేషం అని రుద్దడం లేదా.. నా కార్ లో పెట్రోల్ లేదు బైక్ కి సైలెన్సర్ లేదు అని సానుభూతి డైలాగ్స్ కొట్టడం. చివరికి అనసూయ ఆంటీని దింపటం అని పోస్ట్ పెట్టాడు. దీనిపై అనసూయ స్పందిస్తూ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ ఎందుకు కార్తీక్ అస్తమానం నన్ను లాగుతారు.
ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని మా వాళ్ళు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నీకు సింపతీ అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం ఉంది. అలాగే దేవుడు మీద.. మా అమ్మ నాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వను.
ఇప్పుడు ఈ ట్వీట్‌ను కూడా తమ స్వార్థానికి వాడుకున్న నేను ఆశ్చర్యపోను. కానీ నాకు వాళ్లకు ఎటువంటి సంబంధం ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేను చుట్టాలం అస్సలు కాదండి. సో నేను నీకు ఆంటీ కానేమో.. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి. మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయేమో? ఎందుకంటే నాకు చూట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నేర్పించారు. ఏదేమైనా మీరు అంతా మంచే జరగాలి అండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ వైరల్ అవుతుండగా.. విజయ్‌ని ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది.
Yenduku Karthik garu astamaanam nannu laagutaaru.. evaru em mafia chestunnaro nenu yeppudo cheppi cheppi odilesanu.. anavasaranga nene hype istunnanani na vaallu antunte nijamenemo ani odilesanu..nenu kuda telangana biddane.. kaani naaku sympathy akkarledu.. naku naa meeda… https://t.co/JhIdIBBM32
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2024