సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు కుట్ర.. బయటపడ్డ నిజాలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత్యకు కుట్ర జరిగింది నిజమే అంటున్నారు పోలీసులు.
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత్యకు కుట్ర జరిగింది నిజమే అంటున్నారు పోలీసులు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసు విచారణలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూసేవాలాతో పాటు సల్మాన్ కూడా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో ఉన్నాడని.. నిందితుడు కపిల్ పండిట్ విచారణలో వెల్లడించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు.
అయితే సింగర్‌కు గ్యాంగ్‌స్టర్‌కు మధ్య ఏదో విషయంలో గొడవ వచ్చేందుకు అవకాశముంది కానీ సల్మాన్‌ను ఎందుకు చంపాలని అనుకున్నారో ఇంకా తెలియలేదన్నారు. సల్మాన్ హత్యకు గ్యాంగ్‌లోని సభ్యులు ఆయన ఇంటి ముందు రెక్కీ నిర్వహించడమే కాకుండా నటుడిని ఫోన్‌లో కూడా బెదిరించినట్లు బయటపడింది. సల్మాన్ హత్యను సంపత్ నెహ్రా కెనడాకు చెందిన మరో గ్యాంగ్ ద్వారా అమలు చేయాలని బిష్ణోయ్ డిసైడ్ చేసినట్లు పండిట్ చెప్పారు. ఇప్పుడు కనుక మూసేవాలా హత్య నిందితుడు పట్టుబడక పోయుంటే ఈపాటికి ఇంకెంతమంది గ్యాంగ్ చేతిలో హతమయ్యేవారో.