Connect Movie Review : నయనతార సినిమా 'కనెక్ట్' మూవీ రివ్యూ
నయనతార నటించిన తాజా సినిమా 'కనెక్ట్' మూవీ రివ్యూ
దిశ, సినిమా: నయనతార నటించిన తాజా సినిమా 'కనెక్ట్'. విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఇంటర్వెల్ లేకుండా ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కూతురుని కాపాడుకోవడానికి ఆరాటపడే తల్లిగా నయనతార నటన బాగుందట. ఒకే ఇంటిలో ఉంటూ డిఫరెంట్ ఎమోషన్స్ చూపించే ఛాలెంజింగ్ క్యారెక్టర్‌కు నయన పూర్తిగా న్యాయం చేసింది. ఆమె తండ్రి పాత్రలో సత్యరాజ్ సహజ నటనను కనబరిచాడు. ఇంకో విషయం ఏమిటంటే..ఈ కథను లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిపించారు దర్శకుడు. ఇందులోని క్యారెక్టర్స్ ఏవీ ప్రత్యక్షంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఉండదు. పూర్తిగా ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే టచ్‌లో ఉంటాయి. సినిమా మొత్తం అలానే కంటిన్యూ అవుతుంది. చివరకు దయ్యం అమ్మును ఆవహించడం, దాని ఆత్మను బయటకు పంపించడం కూడా ఆన్‌లైన్ ద్వారానే సాగుతుంది. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు సగం వరకే సక్సెస్ అయ్యాడని టాక్. ప్రజెంటేషన్, యాక్టింగ్ బాగున్నా..రొటీన్ కథ కారణంగా మూవీ యావరేజ్ స్థాయిలోనే ఆగిపోయింది.