Namitha: నేను హిందువునే.. తిరుపతిలోనే పెళ్లి చేసుకున్నా
తమిళనాడులోని చెన్నై మదుర మీనాక్షి ఆలయంలో మరోసారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయ అధికారులపై దేవదాయశాఖకు ప్రముఖ సినీ నటి నమిత ఫిర్యాదు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై మదుర మీనాక్షి ఆలయంలో మరోసారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయ అధికారులపై దేవదాయశాఖకు ప్రముఖ సినీ నటి నమిత ఫిర్యాదు చేసింది. హిందువులకే ఆలయ దర్శనమంటూ.. ఆలయ అధికారులు తనను అవమానించారని నమిత ఆరోపణలు చేసింది. అన్య మతస్థులకు దర్శనంలో నిబంధనలు ఉన్నాయి. వాటిని మాత్రమే తాము ఫాలో అవుతున్నామని అధికారులు చెబుతున్నారని ఆవేదన చెందారు. ‘నేను తిరుమలలో పెళ్లి చేసుకున్నా. నేను హిందువునే.. నా పిల్లలు కూడా హిందువులే’ అని నమిత స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘ఇవాళ ఉదయం కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వచ్చాను. సడన్‌గా ఆలయ అధికారులు తనను అడ్డుకొని.. సర్టిఫికెట్స్ అడిగారు. ఒక్కసారిగా నేను షాక్ అయ్యా. ఇప్పటివరకు దేశంలోని అనేక ఆలయాలకు వెళ్లాను. ఎక్కడా నన్ను సర్టిఫికేట్స్ చూపించాలని అడగలేదు’ అని నమిత చెప్పారు. అనంతరం తీవ్ర ఆవేదన చెందిన నమిత ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు కంప్లైంట్ చేసింది.