Pushpa 2: పుష్ప2 నుంచి క్లైమాక్స్‌ వీడియో లీక్.. ఫైర్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్

పుష్ప2 నుంచి క్లైమాక్స్‌ వీడియో లీక్

Update: 2024-07-31 09:49 GMT

దిశ, సినిమా: అల్లు అర్జున్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది పుష్ప మూవీ. ఎందుకంటే, ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆపేశారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. కానీ, వాటిలో ఎలాంటి నిజం లేదు. తాజాగా, పుష్ప 2 నుంచి షాకింగ్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

ఓ యాక్షన్ సీన్ షూటింగ్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో పై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నా వీడియో లీక్ అయింది. ఈ మూవీలో నటించే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఫోన్ లోపలకి తీసుకెళ్ళడానికి వీలు లేకుండా నిషేధించారు. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు బ్యాగ్ లో పెట్టుకుని మొబైల్ ను సెట్స్ లోపలికి తీసుకెళ్లారు. క్లైమాక్స్‌ జరిగే సీన్ ను వీడియో తీసి షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ‘పుష్ప 2’ మూవీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఇంత వరకు మూవీ నుంచి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు.

Tags:    

Similar News