Samantha రెండో పెళ్లిపై క్లారిటీ..?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సామ్ ప్రస్తుతం
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సామ్ ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. వీరి విడాకులైనప్పటి నుంచి సామ్, చైకి సంబంధి ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. సామ్ ఏం చేసిందని ఆమె వ్యక్తిగతన జీవితాన్ని టార్గెట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత, చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని ఎవరికి వారుగా బతుకుతున్నారు. సామ్‌కి నాగచైతన్య మీద అంత కోపం ఏం లేదు.. ఎవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారంతే, వీరు మళ్లీ భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశం ఉంది. చైతన్యతో విడిపోయాక సమంత చాలా బాధ పడ్డారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సమంత రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. తాను కెరీర్‌పై చాలా బిజీగా ఉన్నారు అంతే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి సమంత దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు నెటిజన్స్.
Also Read: నా బాడీ ఎలా చెబితే అలా నడుచుకుంటా: Bhumi Pednekar