ఆ తప్పు వల్ల రెండు నెలలు ఏడ్చాను.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్

చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’.

Update: 2024-09-02 10:24 GMT

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈ నెల 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లోకి మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు విశ్రమ్. ఇందులో భాగంగా తాజాగా తన లైఫ్‌లో జరిగిన ఓ ఇన్స్‌డెంట్ గురించి చెప్పుకొచ్చాడు.

‘డైరెక్టర్ మణిరత్నం అంటే నాకెంతో ఇష్టం. ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ను ఎంతగానో ఇష్టపడతా. కెరీర్ స్టార్టింగ్‌లో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కనేవాడిని. ఆ సినిమా తర్వాత కావాలంటే రాటైర్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధమే. ఈ క్రమంలోనే ‘బొంబాయి’ మూవీ ఆఫర్ వచ్చింది. హీరోగా నన్ను ఎంచుకున్నారు. ఫైనల్ ఆడిషన్‌కు నన్ను పిలిచినప్పుడు చిన్న తప్పు జరిగింది. అయితే వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరా తీసుకొచ్చి సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారు. మామూలు కెమెరా తెచ్చి యాక్ట్ చెయ్యమంటారేంటి? ఎందుకు నటించాలి అనిపించింది. అంతే కాకుండా స్టిల్ కెమెరా కావడంతో ఒకవేళ నేను కదిలితే పిక్చర్ బ్లర్‌గా వస్తుందనుకుని అలాగే ఉండిపోయా. అలా నేను చేసిన చిన్న తప్పు కారణంగా ‘బొంబాయి’ సినిమా నా చేయి జారిపోయింది. రెండు నెలల బాధపడ్డాను. పొద్దుట లేవగానే అదే గుర్తుకు వచ్చి ఏడుస్తూ కూర్చునేవాడిని. తర్వాత ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ విక్రం కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Similar News