బాత్రుమ్‌లో అర్జున్‌తో గొడవ.. బ్యాడ్ గర్ల్‌గా మార్చేసింది : బోల్డ్ బ్యూటీ
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ రచయితగా మారడానికి గల కారణాలు వెల్లడించింది.
దిశ, సినిమా : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ రచయితగా మారడానికి గల కారణాలు వెల్లడించింది. 2013లో వచ్చిన ‘ఇన్కార్’ సినిమా తర్వాత అన్నీ బ్యాడ్ క్యారెక్టర్ ఆఫర్లే వస్తుండటంతో ఒత్తిడికి లోనైనట్లు తెలిపింది. అయితే ఆ సయమంలోనే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనలో ఉండగా 2015-16లో రైటర్‌గా మారాలనుకున్నట్లు చెప్పింది. ‘చాలా వరకు నాకు నచ్చని పాత్రల్లో నటించాల్సి వచ్చింది. దీంతో నేనే స్వయంగా స్టోరీస్ రాయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న స్క్రిప్ట్ రైటింగ్స్ కూడా రాస్తున్నా. ‘ఇన్కార్’లో నాకు, అర్జున్ రాంపాల్‌కు మధ్య జరిగే వివాదాస్పద బాత్రూమ్ సన్నీవేశం నేను రాసిందే’ అని తెలిపింది.
ఇవి కూడా చదవండి: నా కూతురును అలాంటి పనులు చెయ్యమని చెప్పలేను: రవీనా టాండన్