మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన చిరు..

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) మరణంతో సినీ లోకంలో విషాదం అలుముకుంది.

Update: 2022-09-29 11:51 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) మరణంతో సినీ లోకంలో విషాదం అలుముకుంది. కాగా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. ఇక ఈ రోజు ఉదయం ఘట్టమనేని కుటుంబాన్ని పర్సనల్‌గా కలిసిన చిరు.. మహేష్ బాబు, కృష్ణను పరామర్శించారు. ఆమె మరణానికి గల కారణాల గురించి తెలుసుకుని.. సానుభూతి వ్యక్తం చేశారు. కాగా 'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బిజీగా ఉన్న చిరు.. నిన్న మహేష్‌ను కలవడం కుదరలేదు.

Tags:    

Similar News