నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి అప్‌కమింగ్ మూవీస్.. ఒక్కో సినిమాకు ఎంతో తెలుసా?
చిరంజీవి హీరోగా మెహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి హీరోగా మెహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నది. తర్వాత మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాల డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లు సమాచారం.
Also Read: విషాదం నింపిన 'గాడ్ ఫాదర్' ఈవెంట్