విరాళాల చెక్కులను సీఎంకు అందించిన చిరంజీవి

వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.

Update: 2024-09-16 07:50 GMT

దిశ వెబ్ డెస్క్ : వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి సహాయ చెక్కును జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు సీఎం సహాయనిధి చెక్కును కూడా సీఎంకు చిరంజీవి అందించారు. అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు. అలాగే సీనియర్ నటుడు అలీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3లక్షలు విరాళంగా అందజేశారు. నటుడు విశ్వక్ సేన్ రూ.10లక్షలు విరాళంగా అందించారు. నటుడు సాయిధరమ్ తేజ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళం అందించారు.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై స్పందించిన సినీ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తూ తమ పెద్దమనసును చాటుకుంటున్నారు.  

 

 

Tags:    

Similar News