Megastar Chiranjeevi: చిరుకు విశిష్ట గౌరవం.. సంతోషంలో సక్సెస్ వెనక కారణాలు వెల్లడించిన మెగాస్టార్
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యామిలీ పట్టరాని ఆనందంలో మునిగితేలుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యామిలీ పట్టరాని ఆనందంలో మునిగితేలుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరో.. కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ ఇప్పటికే పద్మ విభూషన్ అవార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా 156 చిత్రాలు, 537 సాంగ్స్, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకుల్ని అలరించినందుకు చిరు నేడు ఏకంగా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నారు.
ఈ అవార్డును చిరంజీవికి గిన్నిస్ ప్రతినిధులు అండ్ బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పాటల విషయంలో ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌కు చిరుకు ఎప్పుడు గొడవలే అంటూ నవ్వుతూ వివరించారు. తప్పకుండా మూవీలో 6 సాంగ్స్ ఉండాలని అనేవారు అని తెలిపారు. అల్లు అరవింద్ అయితే బలవంతంగా పాటలను పెట్టేవారని అన్నారు. కానీ నా సక్సెస్‌లో అవే ముఖ్యపాత్ర పోషించాయని చిరు గర్వంగా చెప్పారు.
స్నేహితుడు అమీర్ ఖాన్ ఒక్క ఫోన్ చేయగానే ఈ ఈవెంట్‌కు వచ్చారని తెలిపారు. అస్సలు ఈ గిన్నిస్ బుక్ రికార్డు చిరు ఊహించలేదని ఎమోషనల్ అయ్యారు. అవార్డుకు కారకులైన డైరెక్టర్స్‌కు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. డాన్స్ పై తనకున్న ఇష్టమే ఈ అవార్డు వచ్చేలా చేసిందన్నారు. నటన కంటే డాన్స్ అంటేనే ఇష్టమని వెల్లడించారు. రేడియోలో సాంగ్స్ వినేవాడినని, వింటూ స్టెప్పులేస్తూ అందర్ని ఎంటర్‌టైన్ చేసేవాడినని చిరు పేర్కొన్నారు.
ఎన్‌సీసీలో చేరినప్పుడు భోజనం చేశాక ప్లేటును కొడుతూ డాన్స్ చేసేవాడినని తెలిపారు. కెరీర్ స్టార్టింగ్‌లో నరసింహరాజు, సావిత్ర, రోజా, రమణి లాంటి వారు నన్ను ఎంకరేజ్ చేశారని, ఓ రోజు కాలు జారీ కిందపడ్డానని.. దీంతో వాళ్లంతా అయ్యో అన్నారని తెలిపారు. దీంతో నేను కిందపడ్డది కవర్ చేస్తూ.. దాన్ని నాగిని డాన్స్‌లా మార్చి చేశానని చిరు చెప్పుకొచ్చారు. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇక అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. మెగాస్టార్‌కు పెద్ద ఫ్యాన్స్‌ను, నా బ్రదర్ లాంటివాడని తెలిపారు. చిరంజీవి నాకు ఈ కార్యక్రమానికి రమ్మని పిలిచినప్పుడు రిక్వెస్ట్ కాదు.. ఆర్డర్ వేయండని అన్నానని నవ్వారు. ఈ ఈవెంట్ కు హాజరవ్వడం చాలా హ్యాపీగా ఉందని వెల్లడించారు. డాన్స్ కోసం చిరంజీవి ప్రాణం పెట్టేస్తారని మెగాస్టార్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక తెలంగాణ అండ్ ఏపీ ముఖ్యమంత్రులైన సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు.. మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అశ్వనీదత్, బాబీ, రాఘవేంద్రరావు, బి. గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, సురేష్ బాబు, మైత్రి, జెమిని కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు పలువురు పాల్గొన్నారు.
Also Read:Megastar Chiranjeevi ,Guinness World Record ,Telugu Film Industry ,Tollywood Actor ,TFI, Mega Family, Latest News