సినీ కార్మికులకు అండగా నేనున్నాను : మెగాస్టార్ చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Update: 2022-12-30 11:30 GMT

దిశ, సినిమా: చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. సినీ కార్మికుల సమక్షంలోకి అతిథిగా రావడం సంతోషంగా ఉందని తెలిపారు. సినీ కార్మిక సోదరుల సొంతింటి కలను నిజం చేసిన చిత్రపురి కమిటీకి అభినందనలు తెలిపారు.

స్వర్గీయ ఎం ప్రభాకర్ రెడ్డి దూరదృష్టితో ఈ సొసైటీ కోసం చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. దాసరి, రాఘవేంద్రరావు, భరద్వాజ లాంటి వారందరూ చిత్రపురి కాలనీని అద్భుతమైన సొసైటీగా తీర్చిదిద్దారని, భారత దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ సినిమా కార్మికులకు ఇంత పెద్ద గృహ సముదాయం లేదని చెప్పుకొచ్చారు. ఇక చిత్ర పరిశ్రమ తనకెంతో ఇచ్చిందన్న చిరు.. సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.

Tags:    

Similar News