మా వదినను ట్రాన్స్‌జెండర్‌గా చూసి గర్వంగా ఫీల్ అయ్యాను.. Charu Asopa
తాలి’లో సుస్మిత సేన్ నటన చూసి గర్వంగా ఫీల్ అయ్యానంటోంది ఆమె మాజీ మరదలు, నటి చారు అసోపా. సుస్మిత సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో వివాహం చేసుకున్న ఆమె.. జూన్‌లో విడాకులు తీసుకుంది.
దిశ, సినిమా: ‘తాలి’లో సుస్మిత సేన్ నటన చూసి గర్వంగా ఫీల్ అయ్యానంటోంది ఆమె మాజీ మరదలు, నటి చారు అసోపా. సుస్మిత సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో వివాహం చేసుకున్న ఆమె.. జూన్‌లో విడాకులు తీసుకుంది. కాగా ఒక నటిగా ఈ సినిమాలో సుస్మిత ఫర్మార్మెన్స్ పట్ల ప్రశంసలు కురిపించలేకుండా ఉండలేకపోతున్నానని తెలిపింది. ‘వాట్ ఏ ఫర్ఫార్మెన్స్ దీదీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ. హ్యాట్సాఫ్ టు ఎసెన్షియల్ వర్కర్స్. గాట్ గూస్బంప్స్’ అంటూ మూవీలో సుస్మిత ట్రాన్స్ జెండర్‌గా మారుతున్న క్రమంలో తీసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా చారు రియాక్షన్‌పై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇదిలావుంటే.. రాజీవ్‌తో విడిపోయినప్పటికీ ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉందని, మళ్లీ మంచి స్నేహితులుగా మారుతున్నామన్న ఆమె.. కూతురు జియానాను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపింది.