ఎన్టీఆర్‌ను ‘అలా’ ప్రస్తావిస్తూ చరణ్ చేసిన పోస్ట్ వైరల్.!
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది.
దిశ, సినిమా: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఈ రోజు ఉదయం అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో మొత్తం నాలుగు కేటగిరీస్‌లో వీటిని దక్కించుకుంది. దీంతోపాటు మరో ప్రముఖ హాలీవుడ్ ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్’లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీస్ విభాగంలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల పేర్లు కూడా హాలీవుడ్ స్టార్స్‌తో కలిపి ఉన్నాయి. ఇక ఈ నామినేషన్‌కి సంబంధించి చరణ్ లేటెస్ట్‌గా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్, తాం క్రూయిజ్ లాంటి బిగ్గెస్ట్ హాలివుడ్ నటులతో, నా బ్రదర్ ఎన్టీఆర్ పేరు, నా పేరు కలిపి చూడడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. ఇక్కడ చరణ్, తారక్‌ని అన్న అని పిలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.