Chalapathi Rao సినిమాల్లోకి రావడానికి కారణమిదే!
తెలుగు చిత్ర పరిశ్రలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి పెద్దలుగా భావించిన సీనియర్ నటులు వరుసగా కన్నుమూయడం నటీనటులను కలచివేస్తున్నది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి పెద్దలుగా భావించిన సీనియర్ నటులు వరుసగా కన్నుమూయడం నటీనటులను కలచివేస్తున్నది. కైకాల సత్యానారయణ అంత్యక్రియలు పూర్తయ్యి కనీసం 24 గంటలైనా గడువకముందే మరో సీనియర్ నటుడు చలపతి రావు తుదిశ్వాస విడవటం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే, ఈ క్రమంలో చలపతిరావుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చలపతిరావు సినిమాల్లోకి రావడానికి కారణం ఆయన స్నేహితులే అని, చిన్నతనంలో చలపతిరావు నాటకాలు చూసిన ఫ్రెండ్స్ సినిమాల్లో ట్రై చేయాలని సూచించినట్లు సమాచారం. మిత్రుల సలహాలతో చదువుపై ఇంట్రెస్ట్‌లేక రైలు ఎక్కి చెన్నై వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో కీలక నటుడిగా ఎదిగాడు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చలపతిరావు ఇండస్ట్రీలో రాణించారు. 1966లో వచ్చిన గూడచారి 116 సినిమాతో చలపతిరావు సినీరంగ ప్రవేశం చేశాడు. కడప రెడ్డమ్మ, కలియుగ పాండవులు, రాష్ట్రపతిగారి అల్లుడు, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
Also Read..