మలయాళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దుమారం

ప్రస్తుతం మలయాళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దుమారం రేగుతోంది.

Update: 2024-08-25 14:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం మలయాళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దుమారం రేగుతోంది. ఇటీవలే మలయాళీ సినీరంగంలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక అప్పటి నుండి అక్కడి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల మీద పలువురు నటీమణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా మాలీవుడ్ ను కుదిపేశాయి.

'తనకు 21 ఏళ్ల వయసు ఉన్నపుడు ఓసారి నన్ను కలవాలని సిద్ధిఖీ నాకు సందేశం పంపారు. నేను ఆయనను తండ్రిలా భావించాను. కాని తర్వాత ఆయన నన్ను లైంగికంగా వేధించారు. ఆయన నన్ను ఎంతో టార్చర్ చేశారు. అతని వల్ల నా కెరీర్ నాశనం అయింది. ఈ విషయం బయట పెట్టడానికి చాలా సమయం పట్టింది. నాకు ఎవరూ సహాయం చేయలేదు' అని శనివారం ఓ ఇంటర్వ్యూలో రేవతి ఆరోపించింది. రేవతి ఆరోపణల వీడియో వైరల్ అవడంతో సిద్ధిఖీ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. మరోవైపు బెంగాలీ నటి శ్రీలేఖ.. దర్శకుడు, కేరళ రాష్ట్ర చలన చిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలక్రిష్ణన్ పై కీలక ఆరోపణలు చేయగా.. బాలక్రిష్ణన్ వాటిని ఖండించారు. అయినా విమర్శలు ఆగకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.   


Similar News