మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రూరమైన ఆయుధం ''కులం'': కమల్ హాసన్

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-13 08:18 GMT
మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రూరమైన ఆయుధం కులం: కమల్ హాసన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ పా. రంజిత్ ఏర్పాటు చేసిన నీలం బుక్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమే తనకు అతి పెద్ద రాజకీయ ప్రత్యర్థి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను 21 ఏండ్ల యువ‌కుడిగా ఉన్నప్పటినుంచి ఇదే మాట చెబుతున్నా.. ఇప్పటికీ కూడా త‌న‌ది ఇదే మాట‌ని పేర్కొన్నారు.

కాకపోతే ఈ విషయంలో ఇప్పుడు పరిణీతి సాధించి చెబుతున్నానని అన్నారు. ఈ విషయంలో ఎప్పటికీ నా అభిప్రాయం మారదని తేల్చి చెప్పారు. మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రూరమైన ఆయుధం కులమని కీలక ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తమిళనాడులోని ఈరోడ్ నియోజవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమల్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేయనున్నారు. 

Tags:    

Similar News