Yami Gautham: ఫోటో కోసం వచ్చి, బ్యాడ్‌గా వీడియో తీశాడు : యామీ గౌతమ్
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
దిశ, సినిమా: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వారు మాత్రం ఫ్యాన్స్ నుంచి, మూవీస్ నుంచి కొంత ప్రైవసీని కోరుకుంటారు. ఎందుకంటే వారికంటూ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ ఉంటుంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఏదో తెలుసుకోవాలన్న అత్యుత్సాహంతో సెలబ్రేటీలను నానా ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా హీరోయిన్ యామీ గౌతమ్‌కు తాను ఇలాంటి ఓ సంఘటన ఎదుర్కొన్నట్లు చెప్పింది. ‘‘నేను గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లోని హోమ్ టౌన్‌కు వెళ్లాను. అప్పుడు ఓ యువకుడు నా స్టాఫ్ పర్మిషన్ తీసుకుని ఫొటో దిగడానికంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను అతడితో కలిసి ఫొటో దిగాను. కానీ అతను ఫోటో కోసం వచ్చి వీడియో కూడా తీశాడు. అది చాలా బ్యాడ్ వీడియో. దానిని అతను సోషల్ మీడియాలో షేర్‌చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాడు. ఇక ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది కెమెరా పట్టుకుని మా ఇంటికి రావడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు సమాజం ఎటు పోతుంతో అర్థం కావట్లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది యామి.