C 202 Movie: ఒక్క డైలాగ్ లేకుండా కేవలం వాటితోనే ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమైన ‘C 202’

గోవా భామ షారోన్ రియా ఫెర్నాండెజ్ కథానాయికగా నటిస్తోన్న ‘C 202’ చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-10-08 03:29 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: గోవా భామ షారోన్ రియా ఫెర్నాండెజ్ కథానాయికగా నటిస్తోన్న ‘C 202’ చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మున్నా కాశి కథానాయకుడిగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ఎడిటింగ్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కేఏ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హరర్ థ్రిల్లర్ లో శుభలేఖ సుధాకర్,తనికెళ్ళ భరణి, షఫీ, సత్య ప్రకాష్, చిత్రం శీను, వై విజయ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రీసెంట్‌గానే చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. మేకర్స్ ‘సి 202’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం ఈ నెల (అక్టోబరు 25) న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే? ఇందులో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం. కేవలం భయంకరమైన సన్నివేశాలు, సౌండ్ ఫెక్ట్స్ తోనే ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో భయపెట్టనుందట. 


Similar News