అలాంటి పాత్రల్లో నటించాలని ఉందంటున్న బుట్టబొమ్మ..
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సీనియర్ హీరోతో రిలేషన్లో ఉన్నట్లు సోషల్‌మీడియాలో పూజాపై వార్తలొచ్చాయి. వాటికి స్పందించిన ఈ భామ రూమర్స్‌కు పుల్‌స్టాప్ పెట్టింది. కాగా తాజాగా ఈ భామ ‘‘కేసీ కా భాయ్ కేసీ కీ జాన్’’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘‘చిన్నప్పటి నుంచే డాన్స్ చేయాలంటే నాకు చాలా భయమేసేది. అందుకని మా అమ్మ నన్ను భరతనాట్యం నేర్చుకోమని చెప్పేది. ఆ తర్వాత నుంచి డాన్స్ పట్ల ఆసక్తి పెరగడం మొదలయ్యింది. ఇక సినిమాల్లో విషయానికొస్తే నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాకు మహిళలను చైతన్యవంతం చేసే పాత్రల్లో నటించడం అంటే ఎంతో ఇష్టం అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి భాషలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే నేను ఏ భాషలోనైనా సినిమాలు చేయడానికి గౌరవంగా భావిస్తానని పూజా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: ‘రామబాణం’ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్!