దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ను అందుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తరాదిలో కలెక్షన్ల వరద పారించాడు. దీంతో బాలీవుడ్ నిర్మాతల కళ్లు బన్నీ సినిమాలపై పడ్డాయి. పుష్ప అందుకున్న హిట్‌కు మరిన్ని దక్షిణాది సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులకు అందించాలని నిర్మాత ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే 2020 టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ 'అలా వైకుంఠపురములో' సినిమాను జనవరి 26న నార్త్ బెల్ట్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ చేశారు.
ఈ సినిమాతో పాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ హిట్ మూవీ 'రంగస్థలం' సినిమాను కూడా నిర్మాత రెడీగా ఉంచాడు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వీటన్నింటితో పాటు తమిళ సినిమాలు మెర్సల్, విశ్వాసం హక్కులను కూడా నిర్మాత మనిష్ షా, అతడి టీం సొంతం చేసుకుందట. దీన్ని చూస్తుంటో ఉత్తరాదిలో దక్షిణాది సినిమాలు చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తోంది. మరి బన్నీ, చెర్రీ సినిమాలు మరోసారి ఉత్తరాదిలో బంపర్ హిట్లు అవుతాయేమో చూడాలి.