Brahmamudi : మొత్తం మా చెల్లె చేసిందంటూ కావ్య మీద నింద వేసిన స్వప్న?

బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-11-01 06:22 GMT

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘అక్కా ఏం మాట్లాడుతున్నావే.. నువ్వు తప్పించుకోవడానికి నన్ను దోషిని చేస్తున్నావేంటే?’ అంటూ కావ్య, స్వప్న దగ్గరకు వచ్చి అడుగుతుంది. ‘నువ్వు ఆగు కళావతీ.. ఇలాంటి అవకాశవాదుల గురించి నాకు బాగా తెలుసు.. స్వప్నా.. కావ్య కి తప్పు చెయ్యాల్సిన అవసరం లేదు’ అని రాజ్ కోపంగా అంటాడు. ‘లేదు రాజ్..నీకేం తెలీదు రాహుల్ నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి నేను చచ్చిపోవాలి అనుకున్నాను.. అప్పుడు మా చెల్లె.. కడుపుతో ఉన్నావని అబద్దం చెబితే రాహుల్‌ నిన్ను పెళ్లి చేసుకుంటాడని సలహా ఇచ్చింది.. అందుకే నేను అబద్దం చెప్పాల్సి వచ్చింది’ అంతకి మించి ఏమి లేదని స్వప్న అంటుంది. ఇదే మంచి అవకాశం అని రుద్రాణి స్టార్ట్ చేస్తుంది.. ‘ఇదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలా? బాగుంది’ అనుకుంటూ.. ‘హో.. గాడ్.. తవ్వేకొద్ది కొత్త నిజాలు బయటపడుతున్నాయేంటీ? అంటే అక్కా చెల్లెల్లు కలిసే ఇన్ని రోజులు మమ్మల్ని బురిడీ కొట్టించారా..

కానీ సూపర్ ఎవరికి అనుమానం రాకుండా బాగా నటించారు అని రుద్రాణి అంటుంది. ‘అమ్మా అమ్మా నా పెద్ద కూతురు అవకాశవాదమ్మా.. దాని స్వార్థం కోసం కన్నవాళ్లు వీధిన పడ్డా ఫర్వాలేదు అనుకుంటుంది. దాని సుఖం కోసం సంతోషం కోసం ఎంతకైనా దిగజారుతుంది. కానీ కావ్య అలా కాదమ్మా..పొరపాటున కూడా ఎప్పటికీ అబద్దం చెప్పదు. ఎవరినీ మోసం చేయదు’ అంటూ ఏడుస్తాడు కృష్ణమూర్తి.

Tags:    

Similar News