Brahmamudi: బాబు తల్లి కోసం వేట మొదలుపెట్టిన కళావతి
పసి బిడ్డను అలా రోడ్ మీదే వదిలేసి వెళ్తావా
దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
కళావతి తన వేట మొదలుపెట్టింది.. అప్లికేషన్లో ఉన్న అడ్రస్ పట్టుకుని నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది.మన హీరోయిన్ వెళ్లగానే ఆ ఇంట్లో నుంచి ఓ పెళ్లి అయిన అమ్మాయి బయటకి వచ్చింది.. ‘ఈవిడే అనుకుంటా వెన్నెల.. చూడటానికి అంత ఏమి బాగాలేదు' అని మనసులో అనుకుంటుంది కళావతి. ‘మీకెవరు కావాలండీ?’ అని అడుగుతుంది.. హ ఎవరో అయితే నీతో ఎందుకు మాట్లాడతా నాకు ‘మీరే కావాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. మొత్తం బయటే చెప్పాలా లేక లోపలికి రానిస్తారా?’ అంటూ కళావతి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అయితే ఆమె గౌరవంగానే..ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కళావతిని. ఇక ఇంట్లోకి వెళ్లిన కళావతి.. వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది.
‘కొంచమైనా బుద్ధి ఉందా నీకు .. సిగ్గు అసలే లేదని అర్ధం అయింది.. పసి బిడ్డను అలా రోడ్ మీదే వదిలేసి వెళ్తావా ?’ అంటూ కళావతి గొడవ పెట్టుకుంటుంది ఆ ఇంట్లో. ఇంక ఆమె భయపడి.. ఏమండీ ఒకసారి బయటకి రండి.. అంటూ తన భర్తను పిలుస్తుంది. ‘ఏంటి నీకు పెళ్లి కూడా అయిందా? అయినా నీకు బుద్ధి లేదా? ఇవేం పాడు పనులు.. బాబుని కనేసి నా భర్తకు ఎలా ఇచ్చావ్ ?.. అంటూ కళావతి వాళ్లు చెప్పేది వినకుండా రెచ్చిపోతుంది. చివరికి రాజ్ చెప్పిన ఆ వెన్నెల వేరు.. ఇంట్లో ఉన్న ఈ వెన్నెల వేరు అని తెలుసుకున్నాక ఏమి చేయాలో అర్ధం కాక.. సారీ చెప్పి కళావతి అక్కడి నుంచి బయటపడుతుంది.