Brahmamudi serial: మొదటి సారి చీర కట్టిన అప్పూ.. షాక్ అయిన కళ్యాణ్
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘రేయ్ కళ్యాణ్.. ఆగరా.. అప్పూని ఎందుకు అలా ఏడిపిస్తావ్?’ అంటుంది ధాన్యలక్ష్మి. ‘మీ అబ్బాయికి వేరే వాళ్లని ఏడిపించడం తప్ప ఇంకేమి రావు ఆంటీ?’ అని అప్పు అంటుంది. ‘అలా ఏడిపించకుండా ఉండాలంటే నువ్వు కూడా మంచిగా రెడీ అవ్వు.. నేను నీకు మంచి చీర ఇస్తాను కట్టుకుని రా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక కళ్యాణ్ కు ఎలా అయినా బుద్ది చెప్పాలని ‘పదండి ఆంటీ.. నేను చీర కట్టుకుంటాను’ అని అంటుంది. సరే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్తారు. మరోవైపు రుద్రాణి డాక్టర్ శ్రీదేవికి కాల్ చేసి.. నేను పంపించిన రిపోర్ట్స్ చూసి త్వరగా విషయం చెప్పు అంటుంది. ఇక కాసేపటికి .. అప్పూ చీరతో నడవలేక నడవలేక మెట్లు దిగి.. మధ్యలోనే ఆగిపోతుంది.
ఇక అప్పూని అంతా తిరిగి చూస్తారు. కళ్యాణ్ అయితే..తనని చూసి నవ్వుతూనే ఉంటాడు. ఇక కళ్యాణ్ కాస్త దగ్గరకు వెళ్లి.. ‘బ్రో.. బ్రో..’ నువ్వేనా అంటూ నవ్వేస్తాడు. ‘చీర కట్టుకోవడం ఓ కల.. నువ్వు కట్టుకుంటే .. అబ్బాయికి చీర కట్టినట్లే ఉంది’ అంటుంది రుద్రాణి వెటకారంగా. కావ్య, కనకం, కృష్ణమూర్తి, అప్పూలు చాలా బాధగా చూస్తారు. ‘కవిగారు ఏడిపించింది చాలు ఇక.. నన్ను, మా అక్కని ఏ మగ పిల్లలు ఏడిపించకుండా ఉండటం కోసమే మా అప్పూని మాకు బ్రదర్‌లా పెరిగింది. అందుకే ఫ్యాంట్ షర్ట్స్ అలవాటు అయ్యాయి. చక్కగా జడ వేసి చీర కడితే అప్పూ మా కంటే చాలా అందంగానే ఉంటుంది’ అని కావ్య అంటుంది.