Brahmamudi : ఆడదాని పవిత్రతకు సాక్ష్యం కావాలా?.. అని రాజ్ ని ప్రశ్నించిన కావ్య
బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
కావ్య రాగానే ఇష్టం వచ్చినట్టు రాజ్ మాట్లాడుతాడు. ‘ఛీ ఛీ.. రాను రాను ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్ధం కావడం లేదు. ఎవరికి నచ్చినట్లు.. ఇష్టం వచ్చినట్లు.. బతికేస్తున్నారు’ అని రాజ్ అంటాడు. ‘ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని కావ్య అంటుంది. రాజ్ మౌనంగా ఉంటాడు.‘మా అక్క తప్పు చేసిందని రాహుల్ లా మీరు కూడా నమ్ముతున్నారా?’ అని కావ్య సూటిగా అడుగుతుంది. ‘తప్పు చేయలేదు అనడానికి తన దగ్గర నోరు తప్ప ఒక్క సాక్షమైనా ఉందా?’ అంటాడు రాజ్ కోపంగా. ‘ఆడదాని పవిత్రతకు సాక్ష్యం కావాలా?’ అంటుంది కావ్య ఆవేశంగా.
‘అంటే నికార్సైన మాటలు చెప్పేసి.. విచ్చలవిడిగా బతకొచ్చా?’ అంటాడు రాజ్. ‘కొంచెం మర్యాదగా మాట్లాడండి. అదేమి విచ్చలవిడిగా బతకలేదు’ అని కావ్య అంటుంది. ‘నువ్వే సర్టిఫికెట్ ఇవ్వాలి.. ఛీ.. సమర్థించడానికి కూడా ఓ హద్దు ఉండాలి..’ అంటాడు రాజ్. ‘నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడానికి కూడా ఓ హద్దు ఉండాలి’ అంటుంది కావ్య. ‘హద్దుల గురించి తెలిసిందే అయితే.. పెళ్లి అయిన తర్వాత ఆ అరుణ్‌తో కలిసి మాట్లాడకూడదు. మాట్లాడినా రహస్యంగా ఉంచకూడదు. నేను కళ్లారా చూశాను.. అదంతా తెలుసా?’ అంటూ రాజ్ స్వప్న గురించి ఇంకా ఇంకా నీచంగా మాటలు అనేస్తాడు.