చిక్కుల్లోపడ్డ ఉర్ఫీ జావేద్.. ఆమెపై నిషేధం విధించిన దుబాయ్ ప్రభుత్వం..??
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ నటిగా కంటే వెరైటీ డ్రెస్‌లతో నెటిజన్లను అలరించే మోడల్‌గానే ఎక్కువ మందికి తెలుసు.
దిశ, సినిమా : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ నటిగా కంటే వెరైటీ డ్రెస్‌లతో నెటిజన్లను అలరించే మోడల్‌గానే ఎక్కువ మందికి తెలుసు. కాస్ట్యూమ్ డిజైనర్‌తో పనిలేకుండా.. ఏ వస్తువునైనా ట్రెండీ అవుట్‌ఫిట్స్‌గా మార్చి ధరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇక అలాంటి దుస్తుల్లో దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని తను హాబీగా మార్చుకుంది. ఈ క్రమంలో బ్లేడ్లు, గాజులతో పాటు రాళ్లను కూడా దుస్తులుగా మార్చేసిన ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్.. తాజాగా కొత్త చిక్కుల్లో పడింది.
దుబాయ్‌లో అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం ఉర్ఫీపై నిషేధం విధించే అవకాశం ఉందట. విషయానికొస్తే.. దుబాయ్‌లో ఇటీవలే సవరించిన నిబంధనల ప్రకారం, పేరు ఒకే పదంతో ఉన్నట్లయితే అనుమతించరు. ఇక తన పేరు కూడా పాస్‌పోర్ట్‌లో కేవలం 'Urfi' అని ఒకే పదంతో ఉంది. ఇదే తను దుబాయ్‌కు వెళ్లేందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఉర్ఫీ.
ALSO READ
నువ్వు అలా ఎత్తితే.. మేము క్లీన్ బౌల్డే: మళ్లీ రెచ్చిపోయిన Sophia