అది అనుకోకుండా జరిగింది.. అభిమానులు క్షమించాలి
2012లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ‘కమాల్ ధమాల్ మలమాల్’.
దిశ, సినిమా: 2012లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం 'కమాల్ ధమాల్ మలమాల్'. శ్రేయాస్ తల్పాడే నటించిన ఈ మూవీ విడుదలై పదేళ్లు దాటింది. అయితే ఇందులోని ఒక సీన్ అనుకోకుండా జరిగిందని గుర్తు చేసుకుంటూ అభిమానులను క్షమాపణలు కోరాడు. విషయానికొస్తే.. ఒక సన్నివేశంలో రన్నింగ్‌లో ఉన్న వాహనాన్ని తన కాలుతో ఆపిన దృష్యం ఉంది. అయితే ఆ కారు మీదా 'ఓం' గుర్తు ఉంది. దీంతో ట్విట్టర్ వేదికగా ఆ క్లిప్‌ను షేర్ చేసిన నెటిజన్లు.. 'హిందూమతంలో దైవిక చిహ్నం అయిన 'ఓం'ను శ్రేయాస్ అగౌరవపరిచారు' అంటూ విమర్శలు చేశారు.
కాగా దీనిపై స్పందించిన నటుడు శ్రేయాస్ 'ఆ వీడియోలో జరిగిన దాని గురించి నేను సమర్థించుకోవట్లేదు. ఇది అనుకోకుండా జరిగింది. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా. దర్శకుడు చెప్పినట్లు చేశాను. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు' అని స్పష్టం చేశాడు.
— Gems of Bollywood Fan (@FilmyKhichdii) February 12, 2023