శుభమా అని ప్రభాస్ హిట్ కొడితే ఇదేం కర్మరా బాబు.. ఈ కొత్త తల నొప్పి ఏంట్రా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రభాస్ కెరియర్‌లోనే ఇలాంటటి వైలెన్స్‌ని ఎప్పుడూ చూడలేదంటూ డార్లింగ్ అభిమానులు ఓ రేంజ్‌లో పండుగా చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. శుభమా అని ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వచ్చి దూసుకుపోతుంటే ఇలాంటి సమయంలో ఇదేం కర్మ అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. అసలు ఏం జరిగిందంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను బాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు కొంత కాలం నుంచి ట్రై చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. ‘సలార్’ సినిమా హిట్ అవ్వకూడదని ప్రత్యేక హోమాలు చేయించాడట. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మా అన్న శుభమా అని హిట్ కొడితే మీ బాధ ఏందిరా మధ్యలో’ అని ‘అయిన నువ్వు పూజలు చేసినంత మాత్రాన హిట్ అయిన సినిమా ప్లాప్ అయిపోతుందా’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.