Prabhas: బ్లాక్ బస్టర్ హిట్ ‘కల్కి’ సీక్వెల్‌కు టైటిల్ ఫిక్స్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘కల్కి ఏడి 2898’ ప్రేక్షకులను మెప్పించి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.

Update: 2024-09-22 14:47 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘కల్కి ఏడి 2898’ ప్రేక్షకులను మెప్పించి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించారు. అయితే కల్కి మూవీ జూన్ 27న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అంతేకాకుండా ఈ మూవీ ఏకంగా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ప్రజెంట్ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సలార్-2, రాజాసాబ్, స్పిరిట్, కల్కి-2 వంటి సినిమాలు లైన్‌లో పెట్టారు. ఈ క్రమంలో.. కల్కి సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి-2 కి ‘కర్ణ-3102BC’ అనే టైటిల్ నిర్ణయించారని టాక్.


Similar News