Avatar: బ్లాక్ బస్టర్ హిట్ అవతార్ సీక్వెల్ అప్డేట్.. టైటిల్‌తోనే అంచనాలను పెంచేసిన మేకర్స్

ప్రపంచం మొత్తంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ అవతార్ మూవీ సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

Update: 2024-08-10 08:16 GMT

దిశ, సినిమా: ప్రపంచం మొత్తంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ అవతార్ మూవీ సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పండోర కల్పిత గ్రహాన్ని సృష్టించి కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. అవతార్ రెండు పార్టులుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతేకాకుండా ఆస్కార్ అవార్డులు కూడా సొంతం చేసుకుని రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ ఏకంగా 160 భాషల్లో విడుదల బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. తాజాగా, అవతార్ సీక్వెల్ అప్డేట్ ఇస్తూ మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అలాగే గెట్ రెడీ ఈ సినిమా డిసెంబర్ 19న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది పండోరా గ్రహానికి వెళ్లడానికి సిద్దం ఉండండి అని తెలిపారు. ప్రజెంట్ మేకర్స్ పెట్టిన పోస్ట్ అంచనాలను పెంచేస్తోంది. ఇక అది చూసిన ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఇప్పటికే ఈ అవతార్-4 2029లో, అవతార్-5 డిసెంబర్ 2031లో రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

(Video Link Credits to avatar Instagram Channel)

Tags:    

Similar News