నటుడి వేధింపుల కారణంగానే బిందుశ్రీ ఆత్మహత్య..! వెలుగులోకి షాకింగ్ నిజాలు..

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ లాంకోహిల్స్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందుశ్రీ (28) 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2023-08-14 04:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ లాంకోహిల్స్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బిందుశ్రీ (28) 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో బిందుశ్రీ అక్కడిక్కడే మరణించింది. అయితే ఆమె చావుకి ఓ నటుడే కారణమని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పూర్ణచంద్ రావు అనే వ్యక్తి గతంలో కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మణికొండ లాంకోహిల్స్ అపార్ట్‌మెంట్‌లో భార్య, కూతురితో నివాసం ఉంటున్నాడు. ఇక హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆయన హోమ్ థియోటర్స్ బిజినెస్ చేస్తున్నాడు. బిందుశ్రీ అనే యువతిని కూతురుకి కేర్ టేకర్‌గా నియమించుకున్నాడు. బిందుశ్రీ అక్కడే మరో గదిలో ఉండేది. ఈ క్రమంలో బిందుశ్రీతో, పూర్ణచంద్ రావు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పూర్ణచంద్ రావు మరో యువతిని కూతురి కేర్ టేకర్‌గా నియమించాడు.

దీంతో శుక్రవారం రాత్రి బిందుశ్రీ, పూర్ణచంద్ రావుకి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి బిందుశ్రీ లాంకోహిల్స్ అపార్ట్‌మెంట్ 21 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరపగా పూర్ణచంద్ రావు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడు కన్నడ సినిమాల్లో నటించానని చెప్పుకుంటూ.. యువతులను ట్రాప్ చేసేవాడట. ఈ క్రమంలోనే తరచుగా అతని అపార్ట్‌మెంట్‌కు యువతులు వచ్చిపోతూ ఉండేవారట. అంతే కాకుండా సినిమా ఆఫర్స్ ఇప్పిస్తానని చెప్పి పూర్ణచంద్ రావు యువతులను మోసం చేస్తున్నట్లు సమాచారం. ఇక బిందుశ్రీ కూడా అతడి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. బిందుశ్రీ తండ్రి ఫిర్యాదుతో పూర్ణచంద్ రావుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News