Bigg Boss: రూల్స్ మార్చిన బిగ్‌బాస్.. ఇక నుంచి హౌస్లో కంటెస్టెంట్స్ మొబైల్ ఫోన్స్ వాడొచ్చు..?
బిగ్‌బాస్ సీజన్ 7 మరింత రసవత్తరంగా సాగుతోంది.
దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 7 మరింత రసవత్తరంగా సాగుతోంది. అన్ని సీజన్స్ లా కాకుండా ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ కొత్త రూల్స్ పెట్టి రన్ చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడలోనూ బిగ్‌బాస్ రియాల్టీ షోస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హిందీలోనూ బిగ్ బాస్ ప్రారంభం కానుంది. ' బిగ్‌బాస్ హిందీ సీజన్ 17' అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే ఈసారి హిందీ బిగ్ బాస్ లో మొబైల్ ఉపయోగించేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇప్పుడు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.
ఒక్కసారి 'బిగ్‌బాస్' ఇంట్లోకి వెళితే బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. మొబైల్ వాడకం కూడా నిషేధించారు. అలాగే బయట జరుగుతన్న విషయాలేవీ ఇంట్లోని సభ్యులకు తెలియకూడదు. కానీ హిందీ బిగ్ బాస్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. కంటెస్టెంట్స్ మొబైల్ ఫోన్లు వాడేందుకు అనుమతిస్తామని చెప్పారు.అయితే మొబైల్ ఫోన్‌లను హౌస్లో ఎలా ప్రవేశపెట్టాలని.. ఆలోచించే పనిలో ఉన్నారట. మొబైల్ ఉపయోగించేందుకు కొన్ని షరతులు కూడా పెడతారని తెలుస్తోంది. ఇంట్లో కంటెస్టెంట్స్ మొబైల్ ని నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉపయోగించాలనే షరతు ఉండనుందట. హిందీలో ఇది విజయవంతమైతే, రాబోయే రోజుల్లో తెలుగు, కన్నడ భాషలలో కూడా మొబైల్ ఫోన్ వాడే అవకాశం ఉంటుందని నెటిజెన్స్ అంటున్నారు.