అదంతా మోజు.. అంతా అయిపోయాక వదిలేసి కొత్త వాళ్ళను చూసుకుంటారు: బిగ్‌బాస్ బ్యూటీ

నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న గీతూ రాయ్ గురించి సుపరిచితమే.

Update: 2024-03-07 10:10 GMT

దిశ, సినిమా: నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న గీతూ రాయ్ గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంది. హౌస్ లో తనదైన స్టైలో టాస్క్ లు ఆడి.. బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. కానీ గీతూ రాయ్ అనూహ్యంగా తొమ్మిదవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. దీంతో రీతూ ఫ్యాన్స్ నిరాశ చెందారు.

ఇకపోతే తాజాగా రీతూ.. లవర్స్ కు ఓ సలహా ఇచ్చింది. ‘‘స్టార్టింగ్ ప్రేమ చాలా బాగుంటుంది. ఫస్ట్ 6 మంత్స్ హనీ మూన్ లాంటిది. ఒకరంటే ఒకరు పడి చచ్చిపోతారు. అది ట్రూ లవ్ కాదు. నిజమైన ప్రేమంటే ఏంటో తెలియాలంటే కనీసం ఒక 6 నెలలు ఎదురుచూడాల్సిందే. అప్పటి వరకు ఉండేది వ్యామోహం మాత్రమే. అన్నీ అయిపోయాక లవ్ బోర్ కొడుతుంది.

ఇక అప్పుడు వారు కొత్త వాళ్లను చూసుకుంటారు. ఒకవేళ 6 నెలల తర్వాత వారి ప్రేమ స్టార్టింగ్ లో ఉన్నట్లు ఉంటే వారిది ట్రూ లవ్ అని చెప్పుకోవచ్చు. లవర్స్ అందరికీ నేనిచ్చే ఉచిత సలహా ఇది’’. అంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News