బుల్లితెరపై బిగ్ బాస్ 7 ప్రారంభం.. పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే..?
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటి వరకు తెలుగులో 6 సీజన్లు ముగియగా.. 7వ సీజన్ గురించి టాక్ ఏం వినిపించడం లేదు. అయితే ఈసారి కొంత ఆలస్యమైన సరే పక్కా ప్లాన్‌తో సీజన్ 7ని ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలని నిర్వాహకులు ప్లాన్స్ చేస్తున్నారట. అయితే ఈ సీజన్ ఎప్పటిలాగే ఉంటుందా? హోస్ట్ నాగార్జుననే ఉంటారా? కొత్త కంటెస్టెంట్స్ ఎవరు? అని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే హోస్ట్‌గా నాగార్జున స్థానంలో బాలకృష్ణను.. వివాదాస్పద వ్యక్తులను, డివోర్స్ తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ‘‘అమర్ దీప్-యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ నిఖిల, నటి ఐశ్వర్య, సింగర్ హేమ చంద్ర, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి మిత్రా శర్మ, నటి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మీ, కమెడీయన్ రష్మీ, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొననున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి: పుష్ప-2 నుంచి వీడియో లీక్..!